తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD: తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం

కరోనా దృష్ట్యా ఇప్పటివరకు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన తితిదే.. ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభించింది. రోజుకు కేవలం రెండు వేల టోకెన్లను మాత్రమే జారీచేస్తున్నట్లు తెలిపిన అధికారులు.. చిత్తూరు జిల్లా భక్తులకే ప్రస్తుతానికి ఈ అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది.

TTD NEWS
TTD NEWS

By

Published : Sep 8, 2021, 7:52 AM IST

Updated : Sep 8, 2021, 1:57 PM IST

తిరుమలలో భక్తులకు సర్వదర్శనాలను తిరిగి పునఃప్రారంభించింది తితిదే. ఈ మేరకు ఈరోజు నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీచేస్తున్నారు. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

రోజుకు కేవలం 2 వేల సర్వదర్శనం టికెట్లను మాత్రమే జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. వీటిని తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కరోనా దృష్ట్యా ఏప్రిల్ 11 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే నిలిపివేసింది. తిరిగి ఇవాళ్టి నుంచి సర్వదర్శనం టోకెన్లును ప్రారంభించింది.

ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన భక్తులకు టోకెన్లు నిరాకరిస్తుంది. ఒకసారి దర్శనం అనంతరం నెల వ్యవధితో టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఎన్ని రోజుల పాటు టిక్కెట్లు జారీ చేస్తారనే సమాచారంపై స్పష్టత లేకపోయినా.. సుదీర్ఘ విరామం తర్వాత టోకెన్లు ఇస్తుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న శ్రీవారిని 21,362 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,762 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.17 కోట్లుగా తితిదే తెలిపింది.

TTD: తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం

ఇదీచూడండి:Central Government: బియ్యం సేకరణపై కేంద్రం తాజా మెలిక... నష్టపోతామంటున్న రైతులు

Last Updated : Sep 8, 2021, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details