తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా ప్రభావం తగ్గేవరకు దర్శనాల సంఖ్యను పెంచే ఆలోచన లేదు' - corona effect on tirumala

తిరుమల శ్రీవారి కల్యాణోత్సవ టిక్కెట్లను ఆన్‌లైన్​లో త్వరలో ఆందుబాటులో ఉంచనున్నట్లు తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే ఉన్నతాధికారులతో వైవీ సుబ్బారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

srivari-kalyanotsava-tickets-online-coming-soon-dot
ఆన్‌లైన్​లో శ్రీవారి కల్యాణోత్సవ టిక్కెట్లు.. త్వరలో..!

By

Published : Jul 30, 2020, 11:02 PM IST

ఎస్వీబీసీ ఛానల్‌ ద్వారా కల్యాణోత్సవ సేవను భక్తులు వీక్షించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. టిక్కెట్లు పొందిన భక్తులకు కల్యాణోత్సవ అక్షింతలు, వస్త్రాలను తపాలా ద్వారా పంపనున్నట్లు స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తగ్గేవరకు దర్శనాల సంఖ్యను పెంచే ఆలోచన లేదని చెప్పారు.

ఆన్‌లైన్​లో శ్రీవారి కల్యాణోత్సవ టిక్కెట్లు.. త్వరలో..!

ఎస్వీబీసీని ప్రకటనలు లేని ఛానల్‌గా ప్రకటించిన ఛైర్మన్‌... నిర్వహణ కోసం భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నామని వివరించారు. ధర్మ ప్రచారం కోసం మరిన్ని లైవ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం హిందీ ఛానల్​ను త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండీ... 'ఇప్పుడు భాజపాకు బలం లేకపోవచ్చు... ప్రజలకు చేరువవుతాం...'

ABOUT THE AUTHOR

...view details