తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్ల జారీ ప్రారంభం - తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం సమాచారం

ఇవాళ ఉదయం నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని సర్వదర్శనం కోసం టోకెన్ల జారీ ప్రారంభం అయింది.

tokens start for sarva darshanam in tirumala
నేటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు

By

Published : Jun 10, 2020, 9:50 AM IST

ఆంధ్రప్రదేశ్​ తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ బుధవారం ఉదయం 7.30 నుంచి ప్రారంభం అయింది. టోకెన్లు పొందిన వారుగురువారం దర్శించుకోవాల్సి ఉంటుంది. తిరుపతిలో మూడు చోట్ల ఏర్పాటు చేసిన కౌంటర్లలో నిత్యం మూడు వేల మందికి ఉచిత దర్శనం టికెట్లు ఇస్తారు. విష్ణు నివాసంలో 8, శ్రీనివాసంలో 6, అలపిరి వద్ద నున్న భూదేవి కాంప్లెక్స్​లో 4 చొప్పున కౌంటర్లను వ్యక్తిగత దూరం పాటించేలా సిద్దం చేశారు.

దర్శనానికి ఒక రోజు ముందు తిరుపతిలోని ఆయా కౌంటర్లలో ఆధార్ కార్డుతోపాటు ఐరిస్ ద్వారా టోకెన్ పొందిన భక్తులు మరునాడు నిర్ధేశించిన సమయానికి తిరుమలలోని వైకుంఠ క్యూకాంప్లెక్స్​కు చేరుకోవాలని తితిదే సూచించింది. కాలినడక భక్తులకు ప్రత్యేక కోటా లేదు.

ఇవీ చూడండి:10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

ABOUT THE AUTHOR

...view details