ఏపీ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం కుడి కాలువ గట్టు, నాగార్జునసాగర్ కుడికాలువ జలవిద్యుత్ ప్రాజెక్టుల పర్యవేక్షణను కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ(Krishna River Management Board))కు అప్పగించటానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
KRMB : కేఆర్‌ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, సాగర్ విద్యుత్ ప్రాజెక్టులు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు - కేఆర్‌ఎంబీ పరిధిలోకి సాగర్ శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులు
ఏపీ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం కుడి కాలువ గట్టు, నాగార్జునసాగర్ కుడికాలువ జలవిద్యుత్ ప్రాజెక్టుల పర్యవేక్షణను కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ(Krishna River Management Board)కు అప్పగించడానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
‘జలవనరుల శాఖ, తెలంగాణ జెన్‌కోతో సంప్రదింపులు జరిపి.. రికార్డులను అప్పగించటంలో వారు వ్యవహరించే తీరుకు అనుగుణంగా వ్యవహరించాలి. ప్రాజెక్టులను అప్పగించినప్పటి నుంచి అందులో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారాలను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకూ బోర్డు(Krishna River Management Board) పర్యవేక్షిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది కలిపి 357 మంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పనిచేసే 63 మంది సిబ్బందిని అప్పగించాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవీ చదవండి :