Srirama navami celebrations: హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని చిత్ర లేఅవుట్ కాలనీలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మేళతాళాలు, వేదమంత్రోశ్చరణల మధ్య సీతారాముల కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా నిన్న రాత్రి.. మంజీరా హైట్స్ ఫేస్-2 నుంచి సీతాదేవిని భాజాభజంత్రీలతో శ్రీరామనామ స్మరణతో కాలనీలోని సంక్షేమ సంఘం భవనంలోకి తీసుకొచ్చారు. బంజారా హైట్స్ ఫేస్-1లో ఉన్న శ్రీరామలక్ష్మణ, హనుమంతుల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కాలనీ సంక్షేమ భవనంలోకి తీసుకొచ్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈరోజు స్వామివారి కల్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఘనంగా జరిగిన సీతారాముల వివాహ వేడుకను కనులారా వీక్షించి.. తన్మయత్వం పొందారు. సీతారాములకు ఒడిబియ్యం పోసి మహిళా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పెళ్లి తంతు ముగిసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
చిత్ర లేఅవుట్లో కమనీయంగా సీతారాముల కల్యాణం.. తిలకించి తరించిన భక్తజనం..
Srirama navami celebrations: శ్రీరామనవమి వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. అందులో భాగంగా.. హైదరాబాద్ ఎల్బీనగర్లోని చిత్ర లేఅవుట్లో కాలనీలో సీతారాముని కల్యాణం వైభవంగా జరిపారు. అనంతరం పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు బారీగా తరలివచ్చారు.
సీతారాముల కల్యాణానికి మాజీ నగర మేయర్ తీగల కృష్ణారెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, భాజపా నాయకులు పేరాల శేఖర్ జీ, ఏసీపీ శ్రీధర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు హాజరయ్యారు. గత పది సంవత్సరాలుగా కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో, వైభవంగా.. కాలనీ వాసులంతా జరుపుకుంటామని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముస్కు అంజిరెడ్డి తెలిపారు. ఏటా సుమారు 2000 మందికి అన్నదానం చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడే జరిగే వేడుకలు చూసేందుకు పక్క కాలనీవాసులు సైతం వచ్చి.. తరిస్తారని వివరించారు. రాముని చల్లని చూపు కాలనీపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: