రోజూ స్కూల్‌కు వెళ్లేముందు !శ్రీనగర్‌కు చెందిన రూహీ సుల్తానా అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాలలో 12 ఏళ్లుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఆమె రోజూ పాఠశాలకు వెళ్లే ముందు వివిధ దుకాణాలకు వెళ్లి చిప్స్, చాకొలెట్ ర్యాపింగ్ పేపర్లు, సబ్బుల కవర్లు, ఖాళీ టెట్రా ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు, రంపపు పొడి, వాడిపడేసిన టీ ఆకులు మొదలైన వ్యర్ధాలను షాపు యజమానులను అడిగి మరీ తీసుకుంటుంది. అవి తీసుకుని నేరుగా స్కూల్‌కు వెళుతుంది. వాటి సహాయంతో స్కూల్లోని పిల్లలకు ఆసక్తి కలిగించే రీతిలో అక్షర జ్ఞానం పంచుతుంది.
వాటి అవసరం లేకుండానే...
పెన్సిల్, పేపర్ అవసరం లేకుండానే విద్యార్థులకు చాలా సులభంగా అర్థమయ్యేలా పాఠాలు నేర్పుతుంది.జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా!విద్యా బోధనలో వినూత్న పద్ధతులు ఆచరిస్తూ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేస్తోన్న ఉత్తమ ఉపాధ్యాయులను భారత ప్రభుత్వం ఏటా ప్రత్యేక పురస్కారంతో గౌరవిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గాను దేశవ్యాప్తంగా మొత్తం 47 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అందులో శ్రీనగర్‌కు చెందిన రూహీ సుల్తానా కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని కలలు కన్న ఆమె ఉర్దూ, కశ్మీరీ భాషల్లో మాస్టర్స్ పూర్తి చేసింది. బోధనకు సంబంధించి బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు చేసిన ఆమె కాలిగ్రఫీ (చేతిరాతకు సంబంధించిన కోర్సు)లో కూడా డిగ్రీ పట్టా అందుకుంది.
ఖర్చు లేకుండా..
అలాంటి పిల్లలకు ఏ ఖర్చూ లేకుండా ! నిత్యం ఉగ్రవాద దాడులు, బాంబుల మోతలతో దద్దరిల్లే శ్రీనగర్‌లో నివాసముండే కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి ఆదాయం కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో బకర్వాల్, గుజ్జర్ అనే రెండు అల్పాదాయ వర్గాలకు చెందిన పిల్లలకు ఎలాంటి ఖర్చు లేకుండా పాఠాలు చెబుతోంది సుల్తానా. పిల్లలకు అర్థమయ్యే రీతిలో సరదాగా ఆటలాడుతున్నట్లుగా, ఆసక్తి కలిగించేలా విద్యా బోధన చేస్తోంది.
ప్లాస్టిక్ కవర్‌పై అక్షరాలు..
‘నేను ప్లాస్టిక్ కవర్లపై అక్షరాలను రాసి పిల్లలతో ప్రాక్టీస్ చేయిస్తాను. వాడి పడేసిన బాటిల్స్, టాఫీ ర్యాపర్లపై పేర్లు, పదాలను రాసి విద్యార్థులతో చదివిస్తాను. అనంతరం వాటిని ఒక అర్ధవంతమైన వాక్య క్రమంలో అమర్చమని పిల్లలకు చెబుతాను. అదేవిధంగా ఎండిపోయిన టీ ఆకులను వివిధ అక్షరాల ఆకృతిలో అమరుస్తాను. సీరియస్ గా కాకుండా ఇలా సరదాగా ఒక ఆట రూపంలో చదువు చెప్పడం వల్ల పిల్లలను బాగా ఆకట్టుకుంటోంది. వారు ఎంజాయ్ చేస్తూనే అక్షర జ్ఞానం పెంచుకుంటున్నారు. వీరిని చూసి మరికొంతమంది పిల్లలు పాఠశాలలో చేరుతున్నారు’ అంటారు సుల్తానా. అలా అడగడానికి నేనేమీ సిగ్గుపడను!పిల్లల పాఠాల కోసం దుకాణ యజమానులను అడిగి మరీ మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలను సేకరిస్తున్నారు రూహీ.