Hyderabad Airport Today : టిక్కెట్లు బుక్ చేసినా సాంకేతిక కారణాలతో కనిపించకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బది పడ్డ ఘటన శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన శిరీష, సుప్రియ కుటుంబ సభ్యులు శ్రీలంకలోని కొలంబోలో నివాసం ఉంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన శిరీష, సుప్రియ ఇద్దరు చిన్నారులతో కలిసి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యూఎల్-178 విమాన సర్వీస్‌లో కొలంబో వెళ్లడానికి ఓ ఏజెన్సీ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్ చేశారు.
Hyderabad Airport Today : ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానం.. ఏమైందంటే? - online tickets issue at Hyderabad airport
Hyderabad Airport Today : హైదరాబాద్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్లడానికి ఇద్దరు మహిళలు వారి కుటుంబ సభ్యులు ఓ ఏజెన్సీ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్ చేశారు. కానీ ప్లేన్ ఎక్కేటప్పుడు చివరి నిమిషంలో వారి టికెట్లు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో కనిపించలేదు. అప్పుడు ఆ విమాన సిబ్బంది వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Hyderabad International Airport Today : అయితే, చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా వారి టికెట్లను శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో చూపించడం లేదంటూ నలుగురు ప్రయాణికులను వదిలేసి విమాన సిబ్బంది వెళ్లిపోయారు. తాము మోసపోయామని గ్రహించి ఆందోళన చెందుతున్న ఆ ప్రయాణికులను విమానాశ్రయంలోని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొన్నారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేందుకు వీల్లేకుండా సుమారు గంటన్నర పాటు ఉంచారని, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని శిరీష, సుప్రియ తెలిపారు. తర్వాత వారు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వెళ్లిపోయారు.