ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా మార్చి 20 నుంచి ముక్కంటి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న అన్ని దేవాలయాల్లో భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఆ సమయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉండటంతో దర్శనాలకు అనుమతించలేదు.
ఈనెల 11న మళ్లీ దర్శనాలు ప్రారంభించాలని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆలయ అర్చకునికి కరోనా పాజిటివ్ రావటంతో తిరిగి వాయిదా పడింది. సుమారు 86 రోజులు తర్వాత దేవాదాయశాఖ ఆదేశాలతో నేటి నుంచి దర్శనాలు ప్రారంభించారు.