తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటినుంచి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - srikalahasthi temple latest news

ఆంధ్రప్రదేశ్​లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో నేటినుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని సుందరగా అలకరించారు.

srikalahasthi-brahmotsavalu-special-officer-azad-inspection-srikalahasthi-temple-in-chitthore-district
నేటినుంచి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 6, 2021, 7:37 AM IST

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నేటినుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామి, అమ్మవార్ల ఉత్సవాలకు ఉపయోగించే బంగారు వాహనాలు, రథాలను సుందరంగా అలంకరించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నేటి నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్ పరిశీలించారు. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి :విద్యుద్దీపాల వెలుగులో రాజన్న ఆలయం

ABOUT THE AUTHOR

...view details