తెలంగాణ

telangana

ETV Bharat / city

వలస కూలీ... కష్టాల మజిలీ! - labour problems

ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వలస కూలీలు... లాక్‌డౌన్‌ కారణంగా తిరుపతిలో చిక్కుకున్నారు. నెల రోజులుగా పనుల్లేక... ఉపాధి కోల్పోయారు. సొంత ఊళ్లో ఉన్న కుటుంబ సభ్యులను కలవలేక ఆవేదన చెందుతున్నారు.

srikakulam-vijayanagaram-districts-migrate-labour-problems
వలస కూలీ... కష్టాల మజిలీ!

By

Published : Apr 26, 2020, 8:35 PM IST

ఆంధ్రప్రదేశ్​లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తిరుపతికి వలస వచ్చిన కూలీలు కరోనా కారణంగా సతమతమవుతున్నారు. సొంత గ్రామాలకు వెళ్ళలేక... ఉన్న ప్రాంతంలో తినడానికి తిండి లేక దుర్బర పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు.

తిరుపతి నగర శివార్లలో జరుగుతున్న గృహ నిర్మాణాల్లో కూలీ పనులు చేసే దాదాపు 200 కుటుంబాలు లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి తిరుపతి నుంచి అందిస్తారు.

వలస కూలీ... కష్టాల మజిలీ!

ఇవీ చూడండి: తగ్గుతున్న కేసులు.. పలుచోట్ల కంటైన్మెంట్​ జోన్లు ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details