Sindhu pushkaralu yatra 2021: సింధు పుష్కరాలకు వెళ్లి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికులు కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు.
అసలేం జరిగింది..
ఏపీ నుంచి సింధు పుష్కారాలకు వెళ్లిన యాత్రికులు కొందరు జమ్మూకశ్మీర్‌లో చిక్కుకుపోయారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12 మంది చీపురుపల్లి వాసులతో కలిపి మొత్తం 240 మంది... ఓ టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించి యాత్రకు వెళ్లారు. మూడు రోజులు వైష్ణోదేవి ఆలయం సహా కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కట్రాకు చేరుకున్నారు.
యాత్రికులను నిర్బంధించిన హోటల్ నిర్వాహకులు
అక్కడ ఓ హోటల్లో ఉండగా... టూరిజం సంస్థ వ్యక్తి కనిపించకుండా పోయాడు. బస చేసిందుకు డబ్బులు చెల్లించాలని హోటలు నిర్వాహకులు అడగడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. డబ్బులు కట్టేవరకూ విడిచిపెట్టేది లేదంటూ... హోటల్ నిర్వాహకులు వీరిని నిర్భందించారు. ఈ క్రమంలో అక్కడి సెక్యూరిటీ గార్డుతో గొడవ పడి బలవంతంగా బయటకు వచ్చి... ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో... స్థానిక డీఎస్పీ అక్కడకు చేరుకుని యాత్రికులతో మాట్లాడారు.
సింధు పుష్కరాల్లో ఆంధ్ర ప్రజల ఇక్కట్లు టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించామని.. వాళ్లే అంతా చూసుకుంటామని అర్ధాంతరంగా వదిలేశారని యాత్రకు వెళ్లిన ఏపీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:Fake job racket busted: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు