ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో మార్చి 4 నుంచి 14వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు ఆదివారం తెలిపారు. పాదయాత్ర భక్తులకు కాలిబాట వద్ద తాగునీరు, అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
4 నుంచి శ్రీశైలంలో.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - Kurnool District News
ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో మార్చి 4 నుంచి 14 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రోజూ వాహనసేవలు ఉంటాయని దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.
4నుంచి శ్రీశైలంలో.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
మార్చి 11న మహాశివరాత్రి రోజున శ్రీమల్లికార్జునస్వామికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం జరపనున్నట్లు వెల్లడించారు. రోజూ వాహనసేవలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇదీ చదవండి:కనుల పండువగా పెద్దగట్టు జాతర