ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ చిట్టినగర్‌లో ఉన్న నగరాల సీతారామస్వామి, శ్రీమహాలక్ష్మీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజు వేడుకగా నిర్వహించారు. లక్ష పసుపు కొమ్ముల ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. 108 సుహాసినిలతో సామూహిక కుంకమార్చన కార్యక్రమం నిర్వహించారు.
లక్ష పసుపు కొమ్ములతో మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక అలంకారం - విజయవాడ చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
ఏపీలోని విజయవాడ చిట్టినగర్‌లో ఉన్న నగరాల సీతారామస్వామీ, శ్రీమహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరిరోజు లక్ష పసుపు కొమ్ముల అలంకరణలో అమ్మవారు విశేషంగా ఆకట్టుకున్నారు.
![లక్ష పసుపు కొమ్ములతో మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక అలంకారం sri-mahalakshmi-ammavaru-special-puja-in-vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9749323-202-9749323-1606993042710.jpg)
లక్ష పసుపు కొమ్ములతో మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక అలంకారం
అనంతరం ఆలయ పూజారులు మహిళలకు ఆశీర్వచనాలు ఇచ్చి, తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది కార్తిక పౌర్ణమి అనంతరం మూడు రోజుల పాటు అమ్మవారికి ఇలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటి ఛైర్మన్ పోతీన బేసుకంఠేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి:మృతుల కుటుంబాలకు హోంమంత్రి పరామర్శ