హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు - corona vaccination in telangana
10:29 May 16
హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు
రష్యా నుంచి స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు హైదరాబాద్ చేరాయి. రెండో విడతలో 60 వేల డోసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు. 67లక్షల డోసులు కావాలని.. రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి- ఆర్‌డీఐఎఫ్‌ను కోరగా.. రష్యా వాటిని విడతల వారీగా పంపిస్తోంది.
వచ్చే వారం దేశంలో టీకా పంపిణీ ప్రారంభం కానుంది. జూన్ నుంచి దేశంలోనే స్పుత్నిక్-వి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్ ల్యాబ్ ఇప్పటికే ప్రకటించింది. టీకాను రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది.
- ఇదీ చదవండి :టీకా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?