పాఠశాల విద్య నుంచే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాపాలసీ రూపకల్పనకు మంత్రులతో సబ్ కమిటీ నియమించారని... రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అతి తక్కువ జనాభా కలిగిన దేశాలు బంగారు పతకాలు సాధిస్తుంటే... 130 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో క్రీడల పట్ల ఆసక్తి కల్గించేలా ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లేదన్నారు. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇతర దేశాల క్రీడాపాలసీలను అధ్యయనం చేసి... దేశంలోనే లేని క్రీడాపాలసీని తయారు చేస్తామంటున్న శ్రీనివాస్ గౌడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
'రాష్ట్రాన్ని దేశంలోనే తలమానికంగా నిలిపేలా కృషి చేస్తున్నాం' - క్రీడాపాలసీ వార్తలు
క్రీడల పట్ల ఆసక్తి కలిగించి సరికొత్త పాలసీని తీసుకువస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా సబ్‌కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు.
'రాష్ట్రాన్ని దేశంలోనే తలమానికంగా నిలిచేలా కృషి చేస్తున్నాం'