హరీశ్ రావు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు - గోల్నాక శివాలయంలో తెరాస నాయకుల పూజలు
కరోనా బారిన పడ్డ మంత్రి హరీశ్ రావు త్వరగా కోలుకోవాలని... హైదరాబాద్ గోల్నాక శివాలయంలో తెరాస నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి త్వరలోనే ప్రజాసేవలో కొనసాగాలని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
హరీశ్ రావు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని... హైదరాబాద్ నల్లకుంట తెరాస సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోల్నాక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల ఆశజ్యోతి, నిత్యం ప్రజాసేవలో తరించే ప్రజానాయకుడు... త్వరగా కోలుకొని ప్రజా సేవల కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.