కాచిగూడ- గుంటూరు ప్రత్యేక రైలు జూలై 1 నుంచి యథావిధిగా నడుస్తుందని ద.మ.రైల్వేశాఖ వెల్లడించింది. కాచిగూడ నుంచి బయలుదేరి మలక్పేట్, ఫలక్నుమా, బుద్వేల్, ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, శ్రీరాంనగర్, గద్వాల్, శ్రీబాలబ్రమరేశ్వర జోగులాంబ, కర్నూల్సిటీ, వెల్దుర్తి, ధోన్, బేతంచర్ల, నంద్యాల్, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవపల్లె, జగ్గంబోట్ల కృష్ణపురం, కుంబం, తర్లపాడు, మర్కాపూర్ రోడ్, గజ్జలకొండ, దొనకొండ, కురిచేడు, వినుకొండ, నరసరావుపేట, ఫిరంగిపట్నం, పెరిచెర్ల మీదుగా గుంటూరుకు చేరుకుంటుంది.
Trains: మళ్లీ పరుగులు తీయనున్న ప్రత్యేక రైళ్లు... - ద.మ. రైల్వేశాఖ
కరోనా వ్యాప్తి కారణంగా ఆపేసిన పలు రైల్వే సర్వీసులను ద.మ. రైల్వేశాఖ పునరిద్ధరించనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ- గుంటూరు ప్రత్యేక రైలు జూలై 1 నుంచి, సికింద్రాబాద్- భువనేశ్వర్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ఈనెల 20 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
Special trains that will run again after so long time
సికింద్రాబాద్- భువనేశ్వర్ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ఈనెల 20 నుంచి యథావిధిగా అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది. గుంటూరు- రాజగడ ప్రత్యేక రైలు జూన్ 20 నుంచి నడుస్తుందని ద.మ.రైల్వే తెలిపింది.