Train Restaurant: దయచేసి వినండి... మరికొద్ది నిమిషాల్లో బిర్యానీ ఎక్స్‌ప్రెస్ రెండో నంబరు టేబుల్ వద్దకు రానుంది. మీరు ఆర్డరిచ్చిన నోరూరించే ఐస్‌క్రీం... నాలుగో నంబరు టేబుల్‌పై సిద్ధంగా ఉంది. ఈ మాటలు వింటుంటే కొత్తగా ఉంది కదూ! విజయవాడలో ఆహారప్రియులకు సరికొత్త అనుభూతుల్ని పంచేందుకు ఏర్పాటైన.. ట్రైన్ రెస్టారెంట్ గురించే ఇదంతా. నగరంలోని ఎంజీ రోడ్డులో ఈ సరికొత్త 'ప్లాట్‌ఫాం-65 రెస్టారెంట్' అందుబాటులోకి వచ్చింది.
భోజనంతో రైలు వచ్చేస్తుంది..!
ఆర్టర్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే కిచెన్ నుంచి నేరుగా వినియోగదారుల టేబుల్ చెంతకు కూత వేసుకుంటూ రైలు వచ్చేస్తుంది. మనం బుక్ చేసుకున్న ఆర్డర్‌ను ట్యాబ్ ఆధారంగా టేబుల్ నంబర్‌తో సహా వంటకాల లిస్టును ఆన్‌లైన్‌లో కిచెన్‌లోకి పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా వంటకాలు రైలులో టేబుల్ వద్దకు వస్తాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న బేరర్... వాటిని తీసుకుని భోజన ప్రియులకు వడ్డిస్తారు.
- చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. సర్వీస్ కూడా చాలా బాగుంది. మేం వీడియో తీసుకుందాం అనుకున్నాం. కానీ అది చాలా స్పీడ్‌గా వచ్చింది. బట్ మళ్లీ అడిగితే వెనక్కి పంపించి మళ్లీ పంపించారు. బాగుంది సర్వీస్.
- కొత్త థీమ్. ఎక్కడా చూడలేదు. చాలా బాగుందండి.
- బెడవాడ అని ఇన్‌స్టా పేజ్ ఉంటుంది. అందులో చూాశాం. సో.. మా ఫ్రెండ్ బర్త్ డే ఉంది ఎలాగో ట్రై చేద్దామని వచ్చాం. బాగుంది. నచ్చింది.
- ఆన్‌లైన్‌లో బుక్ చేస్కోవాలి మనం. రైల్వే స్టేషన్లో టికెట్ బుక్ చేస్కున్నట్లు మనం వీళ్ల దగ్గర కూడా టికెట్ బుక్ చేస్కోవాలి. కానీ.. మేం అనుకోకుండా బిలేటెడ్ బర్త్‌డే పార్టీని ఇక్కడికి వచ్చి చూస్కున్నాం. ప్లాట్‌ఫాం చాలా బాగుంది.--- కస్టమర్
రైల్వేస్టేషన్‌కు వెళ్లి తిన్నట్లే ఉంటుంది..
తాము కోరిన ఆహారంతో కళ్ల ముందుకు వచ్చే రైళ్లు, అలాగే తింటున్నంతసేపు పక్క నుంచి ఫుడ్ తీసుకువెళ్ళే రైళ్లను చూస్తూ భోజన ప్రియులు సరికొత్త లోకంలో విహరిస్తున్నారు. భోజనాలు తెచ్చే రైలుతో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు. ప్లాట్‌ఫాం-65 రెస్టారెంట్‌కు ఆహార ప్రియుల తాకిడి అధికంగా ఉంది. ఘుమఘుమలాడే వంటకాలతో ఆహార ప్రియుల మనసు దోచేస్తోంది. ఈ రెస్టారెంట్‌లో తింటుంటే... రైల్వేస్టేషన్‌కు వెళ్లి భోంచేసినట్లు ఉందని చెబుతున్నారు.
- ట్రైన్ చూసి పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ కూడా బాగున్నయ్. చాలా బాగుంది. చాలా ఎక్స్‌లెంట్‌గా ఉంది.
- సేమ్ ఆసిటీస్ ట్రైన్లో కూర్చొని తింటున్న ఫీల్ వచ్చింది. బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. కేవలం పిల్లల కోసమే వచ్చాం మేమిక్కడికి. --కస్టమర్