నూతన సంవత్సర వేడుకల్లో మాదకద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ చర్యలు చేపట్టింది. గ్రేటర్ పరిధిలో 57 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 31వ తేదీ సాయంత్రం నుంచి ఒకటో తేదీ ఉదయం వరకు ఈ ప్రత్యేక బృందాలు పని చేస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లపై ఈ బృందాలు నిఘా ఉంచడంతోపాటు.. ఆకస్మిక సోదాలూ చేస్తాయి.
గ్రేటర్ పరిధిలో ప్రత్యేక బృందాలు.. మాదక ద్రవ్యాలకు చెక్! - గ్రేటర్ పరిధిలో ప్రత్యేక బృందాలు
కొత్త సంవత్సర వేడుకలు జరిగే ప్రాంతాలతోపాటు పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లలో మాదక ద్రవ్యాల సరఫరా ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. దీనిపై కఠినంగా ముందుకెళ్లాలని భావిస్తూ.. గ్రేటర్ పరిధిలో 57 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 31వ తేదీ సాయంత్రం నుంచి ఒకటో తేదీ ఉదయం వరకు ఈ బృందాలు నిఘా ఉంచడంతోపాటు.. ఆకస్మిక సోదాలూ నిర్వహిస్తాయి.
నూతన సంవత్సరం సందర్భంగా మాదకద్రవ్యాల ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అంచనా వేసింది. భారీ ఎత్తున మత్తు పదర్థాలు సరఫరా జరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్న ఎక్సైజ్ శాఖ.. కఠినంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. నిఘా కోసం మొత్తం 57 ప్రత్యేక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం నుంచి 7, జిల్లా టాస్క్‌ఫోర్స్ విభాగం నుంచి 6, ఎక్సైజ్ స్టేషన్ల నుంచి మరో 44 బృందాలను ఏర్పాటు చేసినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. అయిదుగురు సభ్యులతో కూడిన ప్రతి బృందానికి ఎస్ఐ, సీఐలు నేతృత్వం వహించనున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు