తెలంగాణ

telangana

ETV Bharat / city

Sravanam Saare : ఔరా..! అల్లుడు తెచ్చిన శ్రావణం సారె అదుర్స్​ - sravanam saare

పది వేల కేజీల స్వీట్లు.. వంద అరటి గెలలు.. రెండు వ్యాన్లలో పండ్లు, పూలు.. వందలాది చీరలు, రవికలు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా..? శ్రావణ మాసం ప్రారంభంలో కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చిన సందర్భంగా తీసుకొచ్చిన సారె. గోదారోళ్ల సారె గోదారంత అన్నట్లు.. కొత్త అల్లుడు తెచ్చిన సారె ఔరా..! అనిపించింది.

ఔరా..! అల్లుడు తెచ్చిన శ్రావణం సారె అదుర్స్​
ఔరా..! అల్లుడు తెచ్చిన శ్రావణం సారె అదుర్స్​

By

Published : Aug 12, 2021, 12:43 PM IST

sravanam sare ఔరా..! అల్లుడు తెచ్చిన శ్రావణం సారె అదుర్స్​

అత్తారింటికి అల్లుడు తెచ్చిన సారె అబ్బురపరిచింది. తెలుగు సంప్రదాయాల్ని మరోసారి గుర్తుచేసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన బత్తుల బలరామకృష్ణ- వెంకటలక్ష్మిల పెద్ద కుమార్తె ప్రత్యూషదేవిని.. యానాంకు చెందిన తోటరాజు-నాగలక్ష్మిల కుమారుడు పవన్ కుమార్‌కు ఇచ్చి మే నెలలో వివాహం చేశారు. తొలి ఆషాడం కావడంతో గత నెల యానాంలోని వియ్యాల వారికి బలరామకృష్ణ పంపిన సారె అబ్బురపరిచింది. అప్పట్లో ఊరూవాడ దాని గురించే చెప్పుకొన్నారు. ఇప్పుడు అదే తరహాలో.. యానాం నుంచి వియ్యాలవారు గాదరాడకు శ్రావణం సారె పంపించారు.

కొత్త అల్లుడు అత్తారింటికి నాలుగు వ్యాన్లలో తీసుకొచ్చిన సారెలో.. 20 రకాల స్వీట్లు ఉన్నాయి. అది కూడా వంద కేజీలో, రెండు వందల కేజీలో కాదు.. ఏకంగా పది వేల కేజీల మిఠాయిలు తెచ్చారు. అలాగే వంద అరటి గెలలు, వివిధ రకాల పళ్లు, పూలు, చీరలు, రవిక ముక్కలతో.. శ్రావణం కావిళ్లు సమర్పించారు. కొత్త అల్లుడికి కాళ్లు కడిగి, హారతులతో సంప్రదాయబద్దంగా సారెను ఆహ్వానించారు.

సంప్రదాయం ప్రకారం సారె ఎలా ఉంటుందో తెలియజేయాలన్నదే తమ ప్రయత్నమని.. బత్తుల బలరామకృష్ణ చెబుతున్నారు. అల్లుడు తెచ్చిన సారెను ఊరంతా పంచుతామంటున్నారు ఆ అత్తామామలు. ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో పోటాపోటీగా పంపిన సారెలు.. గోదావరి ప్రజల సంప్రదాయాన్ని మరోసారి గుర్తుచేశాయి.

ABOUT THE AUTHOR

...view details