తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆత్మగౌరవానికి ప్రతీక.. మన జాతీయ పతాక - story of indian national flag

నేనంతా పిడికెడు మట్టినే కావచ్చు. కలమెత్తితే మన దేశ జెండాకు ఉన్నంత పొగరు ఉంది..! ఏపీలోని గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఈ వాక్యాలు.. దాదాపు అందరికీ సుపరిచితమే. త్రివర్ణ పతాకలోని దర్పాన్ని ప్రతిబింబిస్తాయి..ఈ మాటలు. ఎందరో మహనీయుల త్యాగాలకు ప్రతీక.. మువ్వన్నెల పతాక. అందుకే.. జెండా వూంఛా రహే హమారా అంటూ నినదిస్తారు భారతీయులంతా.

national flag festival
national flag festival

By

Published : Mar 28, 2021, 7:02 AM IST

బానిసత్వం నుంచి బయటపడిన శుభ సందర్భానికి సాక్ష్యంగా నిలిచింది.. జాతీయ పతాకమే. ఎత్తుగా ఎగిరే జెండాయే.. స్వాభిమానానికి సంకేతం. ప్రతిచోటా దేశానికి ప్రాతినిధ్యం వహించే ఈ తిరంగా.. శత వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ మార్చి 31 నాటికి వందేళ్ల మైలురాయి దాటనుంది.

ఎవరెస్టు ఎక్కినా.. చంద్ర మండలంపై అడుగు పెట్టినా.. అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో రాణించినా.. ఇలా విజయం సాధించిన ప్రతి సందర్భంలో కళ్ల ముందు కనిపించేది దేశపు జెండాయే. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకను ఎగరేయందే.. ఆ విజయానికి విలువ ఉండదు అని బలంగా విశ్వసిస్తారు అంతా. స్వేచ్ఛ, అస్తిత్వం, దేశ భక్తి, ప్రతిష్ఠలను చాటే.. స్వాభిమాన గీతిక...జాతీయ పతాక.

ఆ త్రివర్ణ పతాకం అంతెత్తున రెపరెపలాడుతుంటే...ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది. మరీ ముఖ్యంగా.. బానిసత్వాన్ని ఎదిరించి గెలిచిన భారత్‌ లాంటి దేశాల్లో జాతీయ జెండాకున్న ప్రాధాన్యత వెలకట్టలేనిది.

ఎక్కడ త్రివర్ణపతాకం కనిపించినా.. స్వతంత్ర సాధన కోసం ఉద్యమించిన వారి తపన గుర్తొస్తుంది. ఈ కల సాకారం చేసుకునేందుకు వారు పడిన కష్టమేంటో తెలిసొస్తుంది. స్వాతంత్య్ర సమర యోధుల పోరాట పటిమకు, స్వరాజ్యోద్యమానికి సాక్ష్యంగా నిలిచిన మన త్రివర్ణపతాకం.. వందేళ్లు పూర్తి చేసుకోనుంది.

జాతీయపతాకం రూపొందించి.. ఈ ఏడాది మార్చి 31వ తేదీకి వందేళ్లు. స్వేచ్ఛాభారాతానికి చిహ్నంగా ఆసేతుహిమాచలం.. రెపరెపలాడే మువ్వన్నెల జెండా శతవసంతాల పండుగ సందర్భాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది యావత్ దేశం.

ఇదీ చదవండి:ఇలా అనుకున్నది చేసేస్తే మీరే గొప్పోళ్లు!

ABOUT THE AUTHOR

...view details