తెలంగాణ

telangana

ETV Bharat / city

భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్... 24 ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - ఉప్పల్​ క్రికెట్​ మ్యాచ్​

Special RTC buses for tomorrow match: భారత్​ ఆస్ట్రేలియా టీ ట్వంటీ క్రికెట్​కు టీఎస్​ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇవి నగరంలోని 24 ప్రాంతాలను నుంచి క్రికెట్​ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ అవకాశాన్ని క్రీడాభిమానులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఈడీ యాదగిరి కోరారు.

special rtc buses
ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

By

Published : Sep 24, 2022, 10:05 PM IST

Special RTC buses for tomorrow match: ఉప్పల్​లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగే టీ-20 క్రికెట్ మ్యాచ్ సందర్బంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. హైదరాబాద్​ నగరంలోని 24 ప్రదేశాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామన్నారు. క్రీడాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈడీ యాదగిరి విజ్ఞప్తి చేశారు.

ఏఏ రూట్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి..మెహదీపట్నం-రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉప్పల్ రూట్, ఘట్కేసర్-రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉప్పల్ రూట్, హయత్ నగర్, ఎన్.జీ.ఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోటి, దిల్​సుఖ్​నగర్, అఫ్జల్​గంజ్, లకిడికాపూల్, బీహెచ్.ఈఎల్, జీడిమెట్ల, కేపీహెచ్బీ, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, యూసఫ్​గూడ, బోయిన్​పల్లి, చార్మినార్, చంద్రాయణగుట్ట, కొండాపూర్ -రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉప్పల్ రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details