భోలక్‌పూర్‌లో బాలరాముడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు - భోలక్‌పూర్‌లో ప్రత్యేక పూజలు
అయోధ్యలో రామమందిరం నిర్మాణానకిి భూమి పూజ సందర్భంగా... హైదరాబాద్ ముషీరాబాద్‌లోని పద్మశాలి కాలనీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి శుభసూచకంగా సొసైటీ ప్రతినిధులు స్థానికులకు మిఠాయిలు పంచారు.
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొసైటీ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు కాలనీవాసులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మా ఇంటికి రాకండి మీ ఇంటికి రానివ్వకండి అంటూ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నందున... బాల రాముడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1992 సంవత్సరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బి. గోవింద్ రాజును సొసైటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుందర్ పట్టాలే, ఆంజనేయులు... శాలువతో సన్మానించారు. రామమందిర నిర్మాణానికి శుభసూచకంగా సొసైటీ ప్రతినిధులు స్థానికులకు మిఠాయిలు తినిపించారు.