తెలంగాణ

telangana

ETV Bharat / city

చోళుల కాలం నాటి ఆలయంలో విశిష్ఠ పూజలు - ananthapuram district lord shiva temple latest news

చోళుల కాలంలో కంబదూరు మండలంలో కట్టిన పురాతన మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రోహిణి కార్తె ప్రారంభం రోజున ఎల్లప్పుడు ఇక్కడ విశిష్ఠ పూజలు చేస్తారు. అయితే ఈసారి సోమవారం కావడం వల్ల ఈ ఆలయ పూజారులు ప్రత్యేకంగా శివలింగాన్ని అలంకరించారు.

kambadooru malleshwara swamy templekambadooru malleshwara swamy temple
చోళుల కాలం నాటి ఆలయంలో విశిష్ఠ పూజలు

By

Published : May 26, 2020, 9:22 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పురాతన మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోళుల కాలంలో కట్టిన ఈ పురాతన ఆలయంలో ప్రతి ఏటా రోహిణి కార్తె ప్రారంభం రోజున ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి సోమవారం కావడం వల్ల శివలింగాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకారం ఆకర్షణీయంగా ఉండటంతో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details