జూన్ 16వ తేదీన ఏవోబీలోని తీగలమెట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్ను ఖండిస్తూ జులై ఒకటో తేదీన జోన్ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో వాహనాల తనిఖీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని గ్రామాల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆరా తీస్తున్నారు. ఓ పక్క బంద్.. మరోపక్క పోలీసుల తనిఖీలు..మన్యంలో ఎప్పుడు ఎం జరుగుతుందోనని గిరిజనులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని గడుపుతున్నారు.
సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల పర్యటన..
మన్యంలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు అదనపు డీజీ రష్మీ శుక్లా, ఐజీ మహేశ్ చంద్ర లడ్డా నేతృత్వంలో అధికారుల మంగళవారం పర్యటించారు. మావోయిస్టులు జులై 1న బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నవరం, చింతపల్లి, జి.మాడుగులలోని సీఆర్పీఎఫ్ క్యాంపులను పరిశీలించారు. మన్యంలోని పరిస్థితులపై జవాన్లతో సమీక్షించిన ఉన్నతాధికారులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.