తెలంగాణ

telangana

ETV Bharat / city

పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం తగదు: ఏపీ స్పీకర్ - news on raghuram krishna raju

పార్టీలో కొనసాగుతూ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేయడం తగదని ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పార్టీలో ఉండటం ఇష్టం లేకుంటే రాజీనామా చేయాలన్నారు. న్యాయవ్యవస్థపై తాను మాట్లాడడం తప్పు కాదన్నారు.

పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం తగదు: ఏపీ స్పీకర్
పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం తగదు: ఏపీ స్పీకర్

By

Published : Jul 4, 2020, 4:27 PM IST

పార్టీ గుర్తుపై గెలిచి అధికారంలో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులే ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సభాపతి దర్శించుకున్న అనంతరం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగుతూ ప్రభుత్వంపై ఎంపీ విమర్శలు చేయడం తగదన్నారు. పార్టీలో ఉండటం ఇష్టం లేకుంటే రాజీనామా చేయాలన్నారు.

న్యాయవ్యవస్థపై తాను మాట్లాడడం తప్పు కాదు అని తమ్మినేని సీతారం అన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు జరగకపోవడానికి కారణం ఎవరనేది.. ప్రతి పౌరునికి తెలుసన్నారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు సహితంగా అర్థవంతంగా ఉండాలని సభాపతి తమ్మినేని సీతారాం హితవు పలికారు.

ఇదీ చదవండి: వసతి గృహాల నిర్మాణంపై కర్ణాటక, తితిదే మధ్య ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details