తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Speaker Tammineni On BJP: భాజపా ప్రజాగ్రహ సభపై స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు - భాజపాపై స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు

AP Speaker Tammineni On BJP: భాజపా ప్రజాగ్రహ సభపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఖరిపై మాట్లాడేముందు... విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్, ప్రత్యేక హోదా వంటి అంశాలపై మాట్లాడితే బాగుంటుందన్నారు. స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేస్తుంటే గుండె తరుక్కుపోతుందని వ్యాఖ్యానించారు.

Speaker Tammineni On BJP
Speaker Tammineni On BJP

By

Published : Dec 28, 2021, 4:34 PM IST

AP Speaker Tammineni On BJP: ఆంధ్ర ప్రజల మదిలో ఉన్న చిక్కుముడిని భాజపా పెద్దలు విప్పాలని ఆ రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన... భాజపా ప్రజాగ్రహ సభపై స్పందించారు. భాజపా సదస్సులో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడాలంటూ హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో విద్యార్థి నాయకుడుగా పాల్గొన్నానని చెప్పిన సభాపతి తమ్మినేని.. ఎందరో నాయకులు స్టీల్ ప్లాంట్ కోసం అమరులు అయ్యారని గుర్తు చేశారు.

Speaker Tammineni On visakha steel plant privatization సభాపతిగా మాట్లాడుతున్నానని భాజపా నాయకులు అనుకోవడానికి ఏం లేదన్న తమ్మినేని.. ప్రత్యక్షంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడిగా.. గుండె మంటతో మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా కోసం భాజపా నాయకులు చెబితే సంతోషిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రజలే తేల్చుతారన్నారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details