తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏం తమాషా చేస్తున్నారా...?.. అధికారిపై స్పీకర్ ఆగ్రహం - AP Speaker Tammineni

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయం వద్ద స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ జయంతిపై ఫోన్ లో సీరియస్ అయ్యారు.

ap speaker
ap Speaker

By

Published : Jan 30, 2022, 1:43 PM IST

Updated : Jan 30, 2022, 1:59 PM IST

ఏం తమాషా చేస్తున్నాారా...?.. అధికారిపై స్పీకర్ ఆగ్రహం

Speaker fired on Civil Supply Officer : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయం వద్ద స్పీకర్ తమ్మినేని సీతారాం... జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ జయంతిపై ఫోన్​లో సీరియస్ అయ్యారు. ఆమదాలవలస వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో... పనిలేక తీవ్రఇబ్బందులు పడుతున్నామని.. జిల్లాలో ఉన్న ఏ మిల్లు నుంచి బియ్యం రావట్లేదని కొందరు కూలీలు స్పీకర్​ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలు విన్న స్పీకర్.. సివిల్ సప్లై మేనేజర్​కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో తాను చెప్పినా ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహించారు. "ఏం తమాషా చేస్తున్నారా... నేను ఎవరు అనుకుంటున్నారు" అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. తక్షణమే ఆమదాలవలస వచ్చి కూలీలకు పనికల్పించాలని ఆదేశించారు. సమస్య పరిష్కరిస్తానని మేనేజర్​ చెప్పడంతో స్పీకర్​ శాంతించారు.

ఇదీచూడండి:దళితుడిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా మూత్రం తాగించి!

Last Updated : Jan 30, 2022, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details