కొవిడ్ ఎఫెక్ట్... అసెంబ్లీ సమావేశాలు మధ్యంతరంగా ముగించే అవకాశం
14:33 September 15
కరోనా దృష్ట్యా సమావేశాలు ముగించాలని అధికారపక్షం ప్రతిపాదన
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కుదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో సమావేశాలను కుదించాలన్న ప్రతిపాదన వచ్చింది. నిన్న నాంపల్లి ఎమ్మెల్యే సహా అధికారులు సిబ్బంది అందరికి కలిసి 52 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో సమావేశాలను కుదించాలన్న ఆలోచన వ్యక్తమైంది. శాసనసభాపక్ష నేతలతో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశమై సమావేశాల కుదింపు విషయమై చర్చించారు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటితో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కృష్ణా జలాలు సహా కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉన్నందున మరికొన్నాళ్లు సమావేశాలు కొనసాగించాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం కోరింది. గ్రేటర్ హైదరాబాద్ అంశంపై చర్చించాలని మజ్లిస్ కోరింది. దీనికి సంబంధించి రేపు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.