తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ వార్తలు నమ్మొద్దు..సకాలంలో బిల్లు చెల్లించండి..

కరెంటు బిల్లును ఎక్కువగా వేస్తున్నారని, రీడింగ్‌ తీయకుండా విద్యుత్‌ సిబ్బంది మోసం చేస్తున్నారని కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ వదంతులను నమ్మవద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి సూచించారు. సకాలంలో ఆన్‌లైన్‌ ద్వారా అందరూ బిల్లులు చెల్లించాలని కోరారు.

వినియోగదారులకు విద్యుత్‌ పంపిణీ సంస్థ వినతి
spdcl request to consumers

By

Published : May 11, 2020, 8:52 AM IST

రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) అనుమతితో పాత ఛార్జీల ప్రకారమే, అత్యంత పారదర్శకతతో బిల్లులు జారీ చేస్తున్నట్లు ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. బిల్లులపై ఎవరికైనా అనుమానాలు, సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను నేరుగా గానీ, టోల్‌ ఫ్రీ నంబరు 1912 ద్వారా గానీ సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. లాక్‌డౌన్‌ కారణంగా గత నెల, ఈ నెలలో ఇంటింటికి తిరిగి కరెంటు మీటరు రీడింగ్‌ తీయలేదన్నారు. ప్రతి ఇంటికి 2019 ఏప్రిల్‌ నెలలో వాడిన కరెంటుకు 2019 మే నెల మొదటివారంలో జారీచేసిన బిల్లునే యథాతథంగా ఈ నెలలో ఇచ్చినట్లు వివరించారు.

లాక్‌డౌన్‌ ముగిశాక వచ్చే నెల మొదటి వారంలో ఇంటింటికి వెళ్లి కరెంటు మీటరు రీడింగ్‌ తీసుకుంటామన్నారు. ఈ రీడింగును మూడు విభాగాలుగా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు విభజించి ఒక్కో నెలకు ఒక్కో బిల్లు చొప్పున ఇస్తామని తెలిపారు. దీనివల్ల శ్లాబు మారడం, బిల్లు ఎక్కువ రావడం అనేవి జరగడానికి ఆస్కారమే ఉండదని పేర్కొన్నారు. ఒకవేళ గత సంవత్సరం కంటే ఇప్పుడు విద్యుత్తు తక్కువగా వినియోగించి అధిక మొత్తాన్ని చెల్లించినట్లయితే తర్వాత జారీ చేసే బిల్లులో ఆ సొమ్మును సర్దుబాటు చేస్తామని సీఎండీ వివరించారు. ఈ నెలలో చిన్న పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల రీడింగ్‌ తీసి వారు గత నెలలో చెల్లించిన సొమ్మును మినహాయించి నికర బిల్లులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ABOUT THE AUTHOR

...view details