Malpractice in Junior Linemen Exam: జూనియర్ లైన్మెన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు. ఎస్పీడీసీఎల్లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం జులై 17న రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదు మంది ఉద్యోగులు కుట్ర, దురాలోచనతో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారనే కారణంతో వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు రఘుమారెడ్డి వెల్లడించారు.
Junior Linemen Exam: "అక్రమాలకు పాల్పడితే డిస్మిస్ చేస్తాం.." - Raghumareddy Response on Malpractice in Junior Linemen Exam
Malpractice in Junior Linemen Exam: జూనియర్ లైన్మెన్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డ నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని.. విధుల నుంచి కూడా తొలగించామన్నారు.
ఎస్పీడీసీఎల్లో పని చేస్తున్న మలక్‌పేట ఏడీఈ లైన్స్ మహమ్ముద్ ఫిరోజ్ ఖాన్, విద్యానగర్ లైన్మెన్ సపావత్ శ్రీనివాస్‌ను విధుల నుంచి తొలగించారు. రేతిబౌలి సెక్షన్లో ప్రైవేట్ మీటర్ రీడర్‌గా పని చేస్తున్న కేతావత్ దస్రు అలియాస్ దశరథ్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. ఎంపీడీసీఎల్లో పని చేస్తున్న జగిత్యాల సబ్‌ఇంజినీర్ షేక్ సాజన్, మిర్యాలగూడలో ఏడీఈ షిఫ్ట్‌గా పనిచేస్తున్న మంగళగిరి సైదులును సస్పెండ్ చేసినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుంచి కూడా తొలగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: