ఆర్థికంగా ప్రపంచంలోనే సూపర్ పవర్ దేశంగా తయారుకావాలనే ఉద్దేశంతోనే.. కరోనా వైరస్‌ను చైనా సృష్టించిందని న్యాయవాది శ్రీనివాసరావు ఆరోపించారు. కొవిడ్ వైరస్‌ను నియంత్రించకపోవడం వల్లనే భారత దేశంలోని ప్రవేశించిదన్నారు. దీని వల్ల భారతదేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందన్నారు. ఎంతో గొప్ప వ్యక్తులు కొవిడ్ బారిన పడి మరణించారన్నారు. జెనీవాలోని అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో కేసు వేసినట్లు తెలిపారు. వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వకుండా.. ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు.
అంతర్జాతీయ న్యాయస్థానంలో చైనాపై కేసు వేసిన ఎస్పీబాలు అభిమాని - చైనాపై కేసుపెట్టిన ఎస్పీ బాలు అభిమాని
కొవిడ్ వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో కేసు వేసినట్లు న్యాయవాది, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమాని శ్రీనివాసరావు తెలిపారు. కరోనాపై సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల భారతదేశం.. ఆర్థికంగా ఎంతో నష్టపోయిందన్నారు. ఎందరో ప్రముఖ వ్యక్తులను కోల్పోవాల్సి వచ్చిందన్నారు
అంతర్జాతీయ న్యాయస్థానంలో చైనాపై కేసు వేసిన ఎస్పీబాలు అభిమాని
కొవిడ్ బారిన పడి ఎంతో మంది ప్రముఖులు మరణించారని.. సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యంను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.