తెలంగాణ

telangana

ETV Bharat / city

నవనందుల నంద్యాలలో ఎస్పీ బాలు పేరిట స్మృతివనం - ఏపీ వార్తలు

సంగీతంలో గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకాలను నెమరు వేసుకొనే క్రమంలో ఆయన పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలలో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నవనిర్మాణ సమితి శ్రీకారం చుట్టింది.

sp-balasubramanyam-memorial-at-nandyala-kurnool-district
నవనందుల నంద్యాలలో ఎస్పీ బాలు పేరిట స్మృతివనం

By

Published : Nov 14, 2020, 7:26 PM IST

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని స్మరించుకుంటూ...ఆయన పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలలో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. హిందూ శ్మశాన వాటికను ఆధునిక వసతులతో నిర్మించే ప్రక్రియ కొనసాగుతోంది. దాతల సహకారంతో నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. అందులో భాగంగా 400 చెట్లు నాటడంతో పాటు ప్రతి చెట్టు వద్ద...ఎస్పీబీ పాటలను సూచికగా పెట్టనున్నట్లు నవనిర్మాణ సమితి సభ్యులు తెలిపారు.

నవనందుల నంద్యాలలో ఎస్పీ బాలు పేరిట స్మృతివనం

ఇదీ చూడండి:తెలంగాణ ప్రజలకు సర్కారు దీపావళి కానుక

ABOUT THE AUTHOR

...view details