రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం - telangana weather report
రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది.
రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం
ఈ అల్పపీడనం 24వ తేదీ నాటికి తుఫానుగా మారే అవకాశముందని.. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి 26న ఉదయం చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
ఇవీ చూడండి:హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరువాన
Last Updated : May 20, 2021, 3:59 PM IST