హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి అరుదైన గౌరవం దక్కింది. కరోనాను కట్టడి చేయడంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, పారిశుద్ద్య సిబ్బందిని... సథరన్ ఆర్మీ వారియర్స్ రాజ్‌పుత్-19 బెటాలియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అత్యవసర వైద్య సేవలందించడంలో భాగంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవే పరమాధిగా నిర్విరామంగా కృషి చేస్తున్నారని అధికారులు కొనియాడారు. ప్రాణదాతలుగా వెలుగొందుతున్న ఫీవర్ ఆసుపత్రి సిబ్బందిని సన్మానించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి అరుదైన గౌరవం - ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి సన్మానం
హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సిబ్బందిని సథరన్ ఆర్మీ వారియర్స్ రాజ్‌పుత్-19 బెటాలియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అత్యవసర సమయంలో కుటుంబాలకు దూరంగా నిర్విరామంగా సేవలందిస్తున్నారని అధికారులు కొనియాడారు.
ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి అరుదైన గౌరవం