మానవ వనరుల అభివృద్ధి, పర్యటక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో హిమాచల్ ప్రదేశ్ సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధిని గవర్నర్ దత్తాత్రేయ దక్షిణ కొరియా రిపబ్లిక్ రాయబారి షిన్బాంగ్కిల్కు వివరించారు. పర్యటక రంగంలో హిమాచల్, దక్షిణ కొరియాలు పరస్పరం సహకరించుకుని సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.
హిమాచల్ గవర్నర్ను కలిసిన దక్షిణ కొరియా రాయబారి - Governor Bandaru Dattatreya
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను దక్షిణ కొరియా రిపబ్లిక్ రాయబారి షిన్బాంగ్కిల్ మర్యాదకపూర్వకంగా కలిశారు. ఇండో-దక్షిణ కొరియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసే చర్యల గురించి ఇరువురు చర్చించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో వారి దేశానికే చెందిన కియా మోటార్స్ నెలకొల్పిన ప్లాంట్ గురించి రాయబారి ప్రస్తావించగా.. తను రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఆ ప్రాంతంలో చేపట్టిన అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాల గురించి అతనికి వివరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి దత్తాత్రేయ, షిన్బాంగ్ సుమారు గంటపాటు చర్చించారు. ఈ కార్యక్రమంలో రాయబారితో పాటు మంత్రి-కౌన్సిలర్ మిస్టర్ చాంగ్ హో సీయుంగ్, రెండో కార్యదర్శి ఎంఎస్ కాంగ్ యోన్ సూ పాల్గొన్నారు.