తెలంగాణ

telangana

ETV Bharat / city

పండగలకు దక్షిణ మధ్య  రైల్వే ప్రత్యేక రైళ్లు

పండగ సమయంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా... దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా రోజుల్లో అదనపు సర్వీసులతో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేశ్​ తెలిపారు.

పండగలకు దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు
పండగలకు దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు

By

Published : Dec 18, 2019, 5:04 AM IST

Updated : Dec 18, 2019, 8:07 AM IST


ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో... దక్షిణ మధ్య రైల్వే 178 ప్రత్యేక రైళ్లను నడునున్నట్లు రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేశ్​ తెలిపారు. తిరుపతి-నాగర్‌సోల్‌-తిరుపతి మధ్య 26 వీక్లీ రైళ్లు నడుపుతామన్నారు. వీటిని జనవరి 3,10,17,24,31 ఫిబ్రవరి 7,14,21,28 మార్చి 6,13,20, 27 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. నాగర్ సోల్-తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను జనవరి 4,11,18,25 ఫిబ్రవరి 1,8,15,22,29 మార్చి 7,14,21,28 తేదీల్లో నడుపుతామని తెలిపారు.

నాందేడ్-తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లను... జనవరి 7,14,21,28, ఫిబ్రవరి 4,11,18,25 మార్చి 3,10,17,24,31 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. తిరుపతి-నాందేడ్ మధ్య జనవరిలో 8,15,22,29, ఫిబ్రవరి 5,12,19,26 మార్చి 4,11,18, 25, ఏప్రిల్ 1న కూడా ఈ రైళ్లను నడుపుతున్నారు. నర్సాపూర్-హైదరాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-మచిలీపట్నం-కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య 38 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. నర్సాపూర్-హైదరాబాద్ మధ్య 3, హైదరాబాద్-విజయవాడ మధ్య 4, మచిలీపట్నం-సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య 7, కాచిగూడ-కాకినాడటౌన్-కాచిగూడ మధ్య 7 ప్రత్యేక సర్వీసుల సేవలు అందించనున్నట్లు తెలిపారు.

జనసాధరణ్, 10 సువిధ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాతాలకు నడపనున్నారు. నర్సాపూర్-హైదరాబాద్ మధ్య ఒక సువిధ, సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య ఒక సువిధ సర్వీసు, కాచిగూడ-కాకినాడటౌన్-కాచిగూడ మధ్య రెండు సువిధ సర్వీసులు, విజయవాడ-విజయనగరం మధ్య ఆరు జనసాధరణ్ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. తిరుపతి-కరీంనగర్ మధ్య 78 ప్రత్యేక సర్వీసులను వారంలో మూడు రోజులపాటు నడపనున్నారు.

పండగలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

ఇదీ చూడండి: రాష్ట్రంలో కల్వకుంట్ల అమ్మకపు పన్ను అమలవుతోంది: రేవంత్​

Last Updated : Dec 18, 2019, 8:07 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details