తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు.. దశల వారిగా పునరుద్ధరణ - పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు

కరోనా విజృంభణతో నిలిచిపోయిన సర్వీసులను రైల్వేశాఖ దశలవారీగా పునరుద్ధరిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం మరో 8 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 13 నుంచి ఒక్కో తేదీలో ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

south central railway
తెలుగు రాష్ట్రాల ప్రత్యేక రైళ్లు

By

Published : Oct 9, 2020, 5:46 AM IST

Updated : Oct 9, 2020, 6:08 AM IST

కరోనా వైరస్‌ విజృంభణతో నిలిచిపోయిన సర్వీసులను రైల్వేశాఖ దశలవారీగా పునరుద్ధరిస్తోంది. తాజాగా ప్రయాణికుల సౌకర్యార్థం మరో 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ తెలిపారు. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైళ్లు సేవలందించనున్నాయి. సికింద్రాబాద్‌-విశాఖ, లింగంపల్లి-కాకినాడ, తిరుపతి- విశాఖపట్నం, సికింద్రాబాద్‌-షాలిమార్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 13 నుంచి ఒక్కో తేదీలో ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే విజ్ఞప్తి చేసింది.

రైళ్ల వివరాలు..

  • ఈనెల 13 నుంచి ప్రతి మంగళవారం ఉ.5.40 గం.కు సికింద్రాబాద్-షాలిమార్ రైలు
  • ఈనెల 14 నుంచి ప్రతి బుధవారం సా.4.05 గం.కు షాలిమార్- సికింద్రాబాద్ రైలు
  • ఈనెల 14 నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.50 గం.కు తిరుపతి-విశాఖ రైలు
  • ఈనెల 15 నుంచి ప్రతి గురు, శని, సోమవారాల్లో రాత్రి 10.25 గం.కు విశాఖ-తిరుపతి రైలు
  • ఈనెల 17 నుంచి ప్రతి శనివారం సాయంత్రం 5.50 గం.కు సికింద్రాబాద్-విశాఖ రైలు
  • ఈనెల 18 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గం.కు విశాఖ-సికింద్రాబాద్ రైలు
  • ఈనెల 26 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 7.55 గం.కు లింగంపల్లి-కాకినాడ రైలు
  • ఈనెల 25 నుంచి ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో రాత్రి 8.10 గం.కు కాకినాడ-లింగంపల్లి రైలు
Last Updated : Oct 9, 2020, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details