Jawad Effect On Railways: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు జవాద్ తుపాను ముప్పు పొంచి ఉంది. అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారిన నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ వెల్లడించారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఈనెల 3, 4 తేదీల్లో రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగా చరవాణి సందేశం ద్వారా పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
Jawad Effect On Railways: జవాద్ తుపాన్ ప్రభావం.. 41 రైళ్లు రద్దు - Jawad cyclone effect on trains
Jawad Effect On Railways : జవాద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 41 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ప్రయాణికులకు సందేశాలు పంపుతామని తెలిపారు.
Jawad cyclone effect on railways