ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల (rains in ap) కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (south central railway) రద్దు చేసింది. తడ-సుళ్లూరుపేట మార్గంలో.. ప్రవహిస్తోన్న వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరటంతో.. ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లింపును పాక్షికంగా రద్దు చేశారు. ఇవాళ్టి తిరుపతి- చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - చెన్నై రైళ్లు రద్దయ్యాయి. చెన్నై సెంట్రల్- ముంబయి సీఎస్ఎంటీ, గుంతకల్- రేణిగుంట రైళ్లు రద్దుచేశారు. బిట్రగుంట- చెన్నై సెంట్రల్, చెన్నైసెంట్రల్- బిట్రగుంట, విజయవాడ - చెన్నైసెంట్రల్, చెన్నైసెంట్రల్ - విజయవాడ రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Trains cancel: భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు, దారిమళ్లింపు - రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల పలు రైళ్లు దారిమళ్లింపు
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల (rains in ap) కారణంగా దక్షిణ మధ్య రైల్వే (south central railway) పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది.
నందలూరు - రాజంపేట మధ్య రైలు పట్టాలపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న కారణంగా.. ఆ మార్గంలోనూ వెళ్లే పలు రైళ్లు రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్, కాచిగూడ-చెంగల్పట్టు, రైళ్లు రద్దయ్యాయి. ఎల్టీటీ ముంబయి- చెన్నై సెంట్రల్, సీఎస్ఎంటీ ముంబయి- నాగర్సోల్, మధురై-ఎల్టీటీ ముంబయి రైళ్లు రద్దు చేశారు. చెంగల్పట్టు- కాచిగూడ, చెన్నై సెంట్రల్- ఎల్టీటీ ముంబయి రైళ్లు రద్దు చేశారు. తడ- సుళ్లూరుపేట మధ్య నడిచే 4 రైళ్లు, నందలూరు- రాజంపేట మధ్య నడిచే 12 రైళ్లు దారి మళ్లించి నడుపుతున్నారు.
ఇదీచూడండి:Tirumala pedestrian path damaged: తిరుమలలో భారీ వర్షం.. కొట్టుకుపోయిన శ్రీవారి మెట్టు మార్గం