దసరా పండగ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు ప్రకటించింది. బరౌని-ఎర్నాకులం, పూరి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, విశాఖపట్టణం-హెచ్ నిజాముద్దీన్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-కడప, విశాఖపట్టణం-విజయవాడ ప్రాంతాల మధ్య ఈనెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
పండగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే - సికింద్రరాబాద్ రైల్వే స్టేషన్
దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 21 నుంచి.. 30 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణికులకు సేవలందిచేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
వీటితో పాటు సికింద్రాబాద్-తిరువనంతపురం వరకు ఈనెల 20వ తేదీ నుంచి 28 వరకు, తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్ ఈనెల 22 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: సినీ ఫక్కీలో కార్యాలయంపై దాడి... మంటల్లో ఫర్నిచర్