తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు - Explain delay in appointing Lokayukta_Telangana

లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలు త్వరలోనే ఏర్పాటు కానున్నాయి. ఈ నెల 19న సీఎం నేతృత్వంలోని కమిటీలు సమావేశం అవుతాయి. ఈభేటీలో లోకాయుక్తతో పాటు ఉపలోకాయుక్తను కూడా ఎంపిక చేస్తారు.

soon-the-lokayukta-and-the-human-rights-commission-will-be-formed
త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘం ఏర్పాటు

By

Published : Dec 16, 2019, 2:42 PM IST


త్వరలో రాష్ట్రంలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘం ఏర్పాటు కానుంది. లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా ఇటీవల చట్టసవరణ చేశారు. ఉపలోకాయుక్తగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తిని నియమించనున్నారు.

ఎంపిక కమిటీ - సభ్యులు

  1. లోకాయుక్త ఎంపిక కమిటీ - సీఎంతో పాటు మండలి ఛైర్మన్, శాసనసభాపతి, ఉభయసభల ప్రతిపక్షనేతలు సభ్యులుగా ఉన్నారు.
  2. మానవనహక్కుల సంఘం ఎంపిక కమిటీ - సీఎం, మండలి ఛైర్మన్, శాసనసభాపతి, ఉభయసభల ప్రతిపక్షనేతలతో పాటు హోంమంత్రి కూడా సభ్యులుగా ఉన్నారు.
  3. రాష్ట్రంలో అటు శాసనసభ, ఇటు శాసనమండలిలో ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేదు. దీంతో రెండు సభల్లోనూ ప్రతిపక్షనేతలు లేరు.

డెహ్రాడూన్​ పర్యాటన రద్దు

మానవహక్కుల సంఘంలో ఇద్దరు సభ్యులను నియమించే అవకాశం ఉంది. ఒకరు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కాగా.. మరొకరు ఇతరులు ఉంటారు. ఇద్దరు సభ్యుల్లో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ఛైర్మన్​గా ఎంపిక చేసే అవకాశం ఉంది. రేపు డెహ్రాడూన్​లో అఖిల భారత చట్టసభల సభాపతులు, కార్యదర్శుల సదస్సు ప్రారంభం కానుంది. మండలి ఛైర్మన్, శాసనసభాపతి ఈ సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అయితే లోకాయుక్త, మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీల సమావేశం నేపథ్యంలో పర్యటన రద్దైనట్లు సమాచారం.

ఇవీ చూడండి: 'కేటీఆర్​ సారూ... స్వదేశానికి వచ్చేలా చూడండి'

ABOUT THE AUTHOR

...view details