తెలంగాణ

telangana

ETV Bharat / city

Sonu sood: సోనూ సూద్​పై అభిమానం... భిన్నంగా చాటుకున్న యువకుడు - sonu latest news

కరోనా కాలంలో ఆపదలో ఉన్నవారికి 'నేనున్నాను' అంటూ సాయం చేస్తూ ఎన్నోసార్లు గొప్ప మనసు చాటుకున్నారు నటుడు సోనూ సూద్​. తెరపై విలన్​గా మెప్పించినప్పటికీ.. ప్రజలు ఆయనను 'రియల్​ హీరో' అని పిలుచుకుంటున్నారు. అలాంటి సోనూ సూద్​పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన యశ్వంత్. రంగోలిని ఇసుకతో కలిపి .. ఆయన చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రానికి ఫిదా అయిన సోనూ సదరు అభిమానిని తప్పక కలుస్తానని మాటిచ్చారు.

sonu sood
సోనూ సూద్ సైకత శిల్పం తయారీ

By

Published : Jun 23, 2021, 3:23 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో సాయం కోరేవారికి అండగా నిలిచాడు నటుడు సోనూ సూద్. సమాజానికి ఆయన చేసిన సేవకు ముగ్ధుడైన ఓ విద్యార్థి సోనూ సూద్ చిత్రాన్ని ఇసుకలో రంగోలిని కలిపి.. 273 చదరపు మీటర్ల ప్రదేశంలో గీసి ఔరా అనిపించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధిస్తానని యశ్వంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సోనూ సూద్ సైకత శిల్పం తయారీ

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యశ్వంత్​కు చిన్ననాటి నుంచే చిత్రకళపై ఆసక్తి. తమ నైపుణ్యానికి మెరుగు పడుతూ తొలుత రెండు చేతులతో బొమ్మలను చూసి చిత్రాలు గీసేవాడు. మిగిలిన చిత్రకారుల కంటే ఎక్కువ గుర్తింపు రావాలనే ఆలోచనతో అతను తన కాళ్లకు కూడా పని చెప్పాడు. రెండు నెలల క్రితం సోనూ సూద్ బొమ్మను తలకిందులుగా నోటితో చిత్రీకరించాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. సోనూసూద్ దానిని చూసి 'త్వరలో కలుద్దాం' అని సమాధానం కూడా ఇచ్చారు.

అక్కడితో ఆగని యశ్వంత్.. వరల్డ్ రికార్డ్స్ సాధించాలనే తపనతో 273 చదరపు మీటర్ల ప్రదేశంలో సోనూసూద్ చిత్రాన్ని చిత్రీకరించి పలువురి మన్ననలు పొందాడు. కేవలం 2.50 గంటల వ్యవధిలో ఈ చిత్రాన్ని తానే స్వయంగా చిత్రీకరించాడు. ఈ చిత్రంతో ప్రపంచ రికార్డు సాధిస్తే ఆ అవార్డుని సోనూసూద్ కు అంకితం చేస్తానని యశ్వంత్ పేర్కొన్నాడు. యశ్వంత్ ఘనత ప్రతిభపై ఆయన చదువుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గా కల్యాణి ఆనందం వ్యక్తం చేశారు. తన కొడుకు ఇలాంటి ఘనత సాధించడం సంతోషంగా ఉందని.. యశ్వంత్​ను మరింత ప్రోత్సహిస్తానని ఆయన తండ్రి చెబుతున్నారు.

ఇదీ చదవండి:Sonu Sood on KTR : మంత్రి కేటీఆర్​ను సోనూసూద్ ఏమన్నారంటే..!

ABOUT THE AUTHOR

...view details