తెలంగాణ

telangana

ETV Bharat / city

Son left his mother on road: జన్మనిచ్చి తల్లయ్యింది... మలివయసులో బరువైంది - ap latest news

Son left his mother on road: ఈ లోకంలో అమ్మను మించిన దైవం ఉండదంటారు.. గుడిలో ఉన్న అమ్మవారిపై ఉన్న భక్తి, గౌరవం ఇంట్లో ఉండే తల్లిపై ఉండటం లేదు.. నవమాసాలు మోసి, కని, పెంచిన ఆ అభాగ్యురాలిపై ప్రేమ కాదు కదా.. కనీసం కనికరం చూపడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం చేసి అన్నం పెట్టిన చేతులకు పండుటాకుల్లా మారిన స్థితిలో ఆదరణ కరవైపోతోంది. కన్నతల్లి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆమెకు వచ్చిన పింఛను డబ్బులు లాక్కుని మరీ.. రోడ్డుపై వదిలేశాడు ఓ కుమారుడు.

Son left his mother on road
Son left his mother on road

By

Published : May 3, 2022, 2:37 PM IST

Son left his mother on road: సమాజంలో నానాటికీ మానవ సంబంధాలు దిగజారుతున్నాయి. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డకు.. ఆ తల్లి బరువైంది. వృద్ధాప్యంలో కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నకుమారుడే.. తల్లిని భారంగా భావించి నిర్ధాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆ​ర్‌ జిల్లా వేంపల్లెలో జరిగింది. ఒకరోజు తర్వాత స్థానిక నేతలు చూసి.. ఆ వృద్ధురాలిని ఆశ్రమానికి తరలించారు.

చక్రాయపేట మండలం అగ్రహారానికి చెందిన అనుమక్క ఆదివారం వాలంటీరు ద్వారా సామాజిక పింఛను అందుకుంది. ఆ పింఛను మొత్తాన్ని కుమారుడు వెంకటరమణ తీసుకున్నాడు. ఆటోలో వేంపల్లెకు తీసుకొచ్చి స్థానిక మెయిన్‌ బజార్‌లో తన తల్లిని వదిలేసి వెళ్లాడు. ఆ రోజంతా ఆమె అక్కడే ఉండిపోయింది. సోమవారం ఈ సమాచారం తెలుసుకున్న వేంపల్లె ఎంపీటీసీ సభ్యుడు కటిక చంద్ర, ముత్యాల రమేష్‌బాబు, ప్రసాద్‌ ఈ విషయాన్ని స్థానిక రాజీవ్‌నగర్‌ కాలనీలోని మదర్‌ థెరిసా అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు వెంకటసుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లి ఆమెను అక్కడికి తరలించారు.

ఇదీ చదవండి:అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని... అందినకాడికి దోచేశాడు

ABOUT THE AUTHOR

...view details