ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో దారుణం జరిగింది. విశ్రాంత ఎక్సైజ్ ఏఎస్సై బత్తుల పరుశురామారావు (71) ను కుమారుడు రమేష్‌బాబు కర్రతో కొట్టి చంపాడు. మృతుడు పరుశురామారావుకు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. కుమారుల్లో చిన్నవాడైన రమేష్ బాబు (38) బీఫార్మసీ చదువుతూ మద్యలోనే ఆపేశాడు. రమేశ్ బాబుకు వివాహమైన తర్వాత అతని మానసిక పరిస్థితి బాగా లేకపోవటంతో.. భార్య వదిలేసి వెళ్లిపోయింది.
అమానవీయం: బొబ్బేపల్లిలో తండ్రిని కర్రతో కొట్టిచంపిన కొడుకు - బొబ్బేపల్లిలో నేర వార్తలు
మందలించాడని ఓ కుమారుడు తండ్రిని కర్రతో కొట్టిచంపాడు. వ్యసనాలకు అలవాటు పడిన నిందితుడు తండ్రి మందలించాడని.. అతనిపై దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా బొబ్బేపల్లిలో జరిగింది.
![అమానవీయం: బొబ్బేపల్లిలో తండ్రిని కర్రతో కొట్టిచంపిన కొడుకు son killed his father in prakasham](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7597382-629-7597382-1592031066011.jpg)
దారుణం: బొబ్బేపల్లిలో తండ్రిని కర్రతో కొట్టిచంపిన కుమారుడు
అప్పటినుంచి రమేశ్ తండ్రి వద్దే ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. ఈ క్రమంలో తండ్రి పరుశురామారావు కుమారుడిని మందలించాడు. ఆవేశానికి గురైన రమేశ్ పక్కనే ఉన్న కర్రతో.. తండ్రి తలపై బలంగా కొట్టటంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్దలాలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!