తెలంగాణ

telangana

ETV Bharat / city

56 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరిన మహిళ.. కన్నతల్లి కోరిక నెరవేర్చిన తనయుడు

Son fulfilled his mother wish in AP : కన్నవారి ఇంటి మీద ప్రేమ పెళ్లైనా సరే పోదు అంటారు. ఎందుకంటే కన్నపేగు బంధం అక్కడే ఉంటుంది కాబట్టి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏదో ఒక వంక పండుగనో, శుభకార్యమనో చెప్పి భర్తను మభ్యపెట్టి అమ్మవారి ఇంటికీ తరుచూ వెళ్తూ ఉంటారు. ఇది ఇంట్లో వాళ్లని ఒప్పించుకుని చేసుకున్న పెళ్లిళ్లకు మాత్రమే. తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇంకా వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్లాలి. అలా ఓ మహిళ పెళ్లి తర్వాత తన పుట్టింటికి దూరమైంది. 56 ఏళ్ల తర్వాత ఆ మహిళ మళ్లీ పుట్టింట్లో అడుగుపెట్టింది. తన తల్లిని పుట్టింటికి దగ్గర చేసి.. అమ్మమ్మ-తాతయ్య, మేనమామలు, చిన్నమ్మలు, పెద్దమ్మల ప్రేమను పొందాడు ఓ యువకుడు.

An old woman
Son fulfilled his mother wish in AP

By

Published : Sep 20, 2022, 11:09 AM IST

Son fulfilled his mother wish in AP: 56 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరిందో ఓ వృద్ధురాలు. తనవారిని చూడాలన్న కోరికను తన కుమారుడు నెరవేర్చి, 56 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఆమె తన పుట్టింటి వారిని చూసిన ఆనందానికి అవధుల్లేవు. ఆమెను చూసిన పుట్టింటి వారు ఎలా స్వాగతించారు, తరవాత ఏవిధంగా వారు స్పందించారో తెలుసుకుందాము..

పుట్టింటికి చేరిన వృద్ధురాలు

ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ఎం.గౌరీపార్వతి యుక్త వయసులో ప్రేమించిన వ్యక్తితో రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. 56ఏళ్ల కిందట పుట్టింటి వారికి దూరంగా వెళ్లిన ఆమె వయసు ఇప్పుడు 72ఏళ్లు. తన వాళ్లందరినీ చూడాలని ఉందని కుమారుడు షణ్ముక్‌రాజ్‌తో కొన్నాళ్ల క్రితం చెప్పారామె. తల్లి కోరిక తీర్చేందుకు ఇటీవల నర్సీపట్నం వచ్చిన అతడు బంధువులను కలిశారు.

తన వాళ్ల కోసం తల్లి ఎంతగా ఆరాటపడుతుందో వివరించారు. దీంతో పుట్టింటి వారంతా తమిళనాడు వెళ్లి గౌరీపార్వతిని చూసి వచ్చారు. 4 రోజుల కిందట గౌరీపార్వతి తన కుటుంబంతో కలిసి నర్సీపట్నంలోని పుట్టింటికి వచ్చారు. ఆమె రాకను బంధుమిత్రులంతా ఆనందంతో స్వాగతించారు. చిన్ననాటి ముచ్చట్ల నుంచి ఇన్నేళ్ల అనుభవాలను పంచుకుంటున్నారు.

తమిళనాడులోని ఎట్టాయపురం ప్రాంతానికి చెందిన నమ్మళ్వార్‌ ఆరు దశాబ్దాల కిందట నర్సీపట్నం ప్రాంతానికి విద్యుత్​ పనుల కోసం రాగా.. గౌరీపార్వతి పరిచయమై ప్రేమగా మారింది. వీరి వివాహానికి అప్పట్లో కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తమిళనాడు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అక్కడే స్థిరపడిపోయారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

ABOUT THE AUTHOR

...view details