తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రేటర్ ఎన్నికల్లో తల్లిని ఓడించిన తనయుడు... - తెరాస అభ్యర్థి ఓటమి

గ్రేటర్​ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో తెరాస అభ్యర్థిపై భాజపా అభ్యర్థి విజయం సాధించారు. ఇందులో ఆసక్తి ఏముందనుకుంటున్నారా...? అసలు విషయమేమిటంటే...

గ్రేటర్ ఎన్నికల్లో తల్లిని ఓడించిన తనయుడు...
గ్రేటర్ ఎన్నికల్లో తల్లిని ఓడించిన తనయుడు...

By

Published : Dec 4, 2020, 9:49 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీఎన్​రెడ్డి నగర్​ డివిజన్​ నుంచి తెరాస పార్టీ తరఫున ముద్దగౌని లక్ష్మీప్రసనన్న బరిలో దిగారు. ఈరోజు నిర్వహించిన లెక్కింపు నేపథ్యంలో... లక్ష్మీప్రసన్న తన ప్రత్యర్థి అయిన భాజపా అభ్యర్థి లచ్చిరెడ్డి చేతిలో ఓడిపోయారు. కేవలం 32 ఓట్ల తేడాతో లక్ష్మీప్రసన్న ఓటమిపాలు కావటం గమనార్హం.

ఇందులో అసలు మలుపేంటంటే... లక్ష్మీప్రసన్న కుమారుడు సైతం బరిలో దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా రంజిత్​గౌడ్ బరిలో దిగారు. తన ప్రభావం ఏ మాత్రం ఉండదని భావించాడు. కానీ తానే తల్లి ఓటమికి కారణమవుతాడని ఊహించలేదు. ఎన్నికల్లో 39 ఓట్లు నమోదయ్యాయి. తనకు వచ్చిన 39 ఓట్ల ప్రభావం తల్లి లక్ష్మీప్రసన్న విజయంపై పడింది. ఆ 39 ఓట్లు కూడా తల్లికే పడి ఉంటే... గెలుపు తెరాస ఖాతాలో పడేది.

ఈ విషయంలో పునరాలోచనలో పడ్డ తెరాస వర్గాలు... చేజేతురాల డివిజన్​ను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గెలుపు విషయంలో భాజపా, తెరాస అభ్యర్థుల మధ్య వివాదం నెలకొంది. ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు తమకు అన్యాయం చేశారంటూ తెరాస వర్గాలు ఆందోళనకు దిగాయి. రీ కౌంటింగ్​కు పట్టుపట్టాయి. కానీ.. అప్పటికే భాజపా అభ్యర్థి గెలుపునకు కావల్సిన ఓట్లు ఉన్నాయని వివరణ ఇచ్చిన అధికారులు... భాజపా అభ్యర్థి లచ్చిరెడ్డి గెలుపొందినట్లుగా ప్రకటించారు. లక్ష్మీప్రసన్నకు 11 వేల 406 ఓట్లు రాగా... భాజపా అభ్యర్థి లచ్చి రెడ్డి 11 వేల 438 ఓట్లు వచ్చాయి. కేవలం 32 ఓట్ల మెజార్టీతో బీఎన్​రెడ్డి నగర్​ డివిజన్​ను భాజపా దక్కించుకుంది.

ఈ విషయంలో తెరాస శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయా. విజయం అంచులదాకా వెళ్లి... అతి తక్కువ ఓట్లతో... అది కూడా తన కుమారుని ప్రభావం వల్ల ఓడిపోవటం ఇప్పుడు ఆ డివిజన్​లో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఘోరపరాభవం

ABOUT THE AUTHOR

...view details