కన్నకొడుకు ఇంటినుంచి గెంటేశాడయ్యా.. న్యాయం చేయాలని విలపిస్తోంది ఓ తల్లి. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కొట్టి నాగేశ్వరమ్మ భర్త మృతి చెంది ఎనిమిదేళ్లు అవుతోంది. అప్పటినుంచి కొడుకు వద్దే ఉంటున్నారు. వృద్ధాప్యంలో తనకు అండగా ఉంటాడని ఆమె తన వద్ద ఉన్న రూ.10లక్షల నగదు, 25 కాసుల ఆభరణాలు ఇలా ఉన్నవన్నీ కుమారుడికి ఇచ్చేశారు. అన్నీ చేతికివచ్చిన తరువాత.. ఊహించని విధంగా కొడుకు, కోడలు ఇంటినుంచి ఆమెను గెంటేశారు.
MOTHER REQUEST : 'కొడుకు గెంటేశాడయ్యా.. నాకు న్యాయం చేయండి!' - కొడుకు గెంటేశాడయ్యా.. మీ కాళ్లు పట్టుకుంటాను న్యాయం చేయండి!
ఎనిమిదేళ్ల క్రితమే కట్టుకున్న భర్త చనిపోయాడు. కన్నకొడుకే ప్రపంచంగా బతికిన ఆ తల్లి భర్త చనిపోయాక.. తన వద్ద ఉన్న డబ్బు, నగలు అన్ని కుమారుడికే ఇచ్చింది. కన్నబిడ్డే కదా కాటికి పోయేవరకు కంటికిరెప్పలా చూసుకుంటాడు అనుకుంది. కానీ.. డబ్బు, నగలు, ఆస్తి చేతికిచిక్కాక ఆ కుమారుడు కర్కశంగా మారాడు. తన భార్యతో కలిసి తల్లిని ఇంట్లోంచి గెంటేశాడు.
MOTHER REQUEST
పెద్దకూతురు కూడా రావద్దని చెప్పడంతో విజయవాడలో ఉంటున్న చిన్నకూతురు వద్ద కొన్నినెలలుగా ఆశ్రయం పొందుతున్నారు. కూతురు వద్ద దీర్ఘకాలికంగా ఉండలేక, ఇంటికి వస్తానని అడిగితే కొడుకు, కోడలు ఒప్పుకోవడం లేదని కన్నీటిపర్యంతమవుతూ తన పరిస్థితిని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో పోలీసులకు చెప్పి న్యాయం చేయాలని కోరారు.