తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రత్యేక హోదాకు.. తెలంగాణకు ఎలాంటి సంబంధమూ లేదు: సోము వీర్రాజు - February 17th meeting

Somu verraju: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉపకమిటీ ఎజెండాలో హోదా అంశంపై తొలగింపుపై ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ప్రత్యేక హోదాకు.. తెలంగాణకు సంబంధం లేదన్నారు.

Somu verraju
Somu verraju

By

Published : Feb 13, 2022, 5:16 PM IST

Somu verraju: ప్రత్యేక హోదాకు, తెలంగాణకు ఎలాంటి సంబంధం లేనందునే అజెండా నుంచి తొలగించారని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. హోదా అంశంపై ఏపీ ప్రభుత్వం కేంద్రంతో ప్రత్యేకంగా చర్చించవచ్చు అన్నారు. ఈనెల 17న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారన్న సోము.. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించబోతున్నారని తెలిపారు.

ఏపీలో 23 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం పనులు చేస్తోందని..ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేసి మరికొన్ని జరుగుతున్నాయన్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రికి గతంలో ప్రభుత్వం భూమి ఇచ్చిందని.. జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ముస్లింలకు.. రాష్ట్రంలో 5 శాతం రిజర్వేషన్ ఇచ్చారని.. అదే విధంగా కాపులకు కూడా ఇవ్వాలని జీవీఎల్ ప్రస్తావించారన్నారు. ఈ ప్రభుత్వానికి ముస్లింలు అంటే ప్రేమ.. కాపులంటే ద్వేషమా అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

"ప్రత్యేక హోదా అనే అంశం కేవలం ఏపీకి సంబంధించిన విషయం. ఫిబ్రవరి 17న జరిగే సమావేశం తెలంగాణకు, ఏపీకి సంబంధించిన వేర్వేరు విషయాలపై జరుగనుంది. ఆస్తుల పంపకం లాంటి ముఖ్యమైన విషయాలు చర్చించనున్నారు. ప్రత్యేక హోదా గురించి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే అజెండా నుంచి ఆ అంశాన్ని తొలగించారు. అందుకోసం ప్రత్యేకంగా మరో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేక హోదా రాష్ట్రం అడగాలి.. కేంద్రం ఇవ్వాలి.. అందుకు సబంధించిన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో ఆ ప్రాసెస్​ జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ఆ కార్యాచరణ ప్రారంభించటంపై ఎలాంటి అభ్యంతరం లేదు." - సోము వీర్రాజు, ఏపీ భాజపా అధ్యక్షుడు

ప్రత్యేక హోదాకు.. తెలంగాణకు ఎలాంటి సంబంధమూ లేదు: సోము వీర్రాజు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details