తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ విషయం... పవన్ కల్యాణ్​​నే అడగాలి : సోము వీర్రాజు - ఏలూరులో సోమువీర్రాజు పర్యటన

Somu on Pawan Comments: పొత్తుల విషయంలో స్పష్టంగా ఉన్నామని భాజపా ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అయితే.. తెదేపా, జనసేన కలుస్తాయా లేదా? అనేది మాత్రం పవన్‌నే అడగాలని చెప్పారు. కుటుంబ పార్టీలతో భాజపా పొత్తు పెట్టుకోదని చెప్పారు.

ఆ విషయం... పవన్ కల్యాణ్​​నే అడగాలి : సోము వీర్రాజు
ఆ విషయం... పవన్ కల్యాణ్​​నే అడగాలి : సోము వీర్రాజు

By

Published : May 9, 2022, 4:39 PM IST

Somu on Pawan Comments: పొత్తుల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని భాజపా ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జనసేనతో పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. తెదేపా, జనసేన కలుస్తాయా? లేదా? అనేది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌నే అడగాలని చెప్పారు. ఏపీలోని ఏలూరులో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. పొత్తులపై నంద్యాల జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆ విషయం ఆయన్నే అడగాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలతో భాజపా పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.

ఏపీలోని శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి చెప్పారు. సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీఫార్మసీ యువతి మృతిపై.. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్యారా విచారణ చేపట్టాలని డీజీపీ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించినట్లు చెప్పారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో జగన్​ ప్రభుత్వం విఫలమైందని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలు జరిగిన సమయంలో పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది తప్ప.. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details